బిజెపి సభ్యత్వ నమోదు

దువ్వ గ్రామంలో రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు దాసరి వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన బిజెపి సభ్యత్వ స్పెషల్ డ్రైవ్ లో 200 మంది బిజెపిసభ్యత్వం తీసుకున్నారని జిల్లా బిజెపి సభ్యత్వ ప్రముఖ్ మరియు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొని నిన్నటికీ సభ్యత్ నమోదు రాష్ట్రంలోని రెండవ స్థానంలో ఉందని ఈ సభ్యత్ నమోదు ఈరోజుతో ముగుస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ గారి తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు ప్రజలు పెదఎత్తున మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సభ్యత్వ కార్యక్రమంలో ముందుకు వచ్చి ఎక్కువ బిజెపి సభ్యత్వాలు మహిళలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులుజిల్లా కార్యవర్గ సభ్యులు సింహాద్రి లక్ష్మణకుమార్ గుప్తా, దాసరి వెంకటస్వామి మండల అధ్యక్షులు జిల్లా ఎస్సీ మొర్చ ఉపాధ్యక్షులు చింత సుబ్బారావు, తణుకు ప్రధాన కార్యదర్శి నాగరాజు, శ్రీను రామకృష్ణ, కనకం మల్లేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link