వార్త‌లు

రతనాలసీమలో పర్యాటకం అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్

కడపలో నిర్వహించిన బలిజ, కాపు, ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం – కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ : త్వరలోనే పర్యాటక కేంద్రాలుగా గండికోట, సిద్ధవటం ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ కడప: రాబోయే ఐదేళ్ల కాలంలో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని […]

వార్త‌లు

ప్రముఖ పర్యాటక కేంద్రంగా సిద్ధవటం – మంత్రి దుర్గేష్

కడప జిల్లా పర్యటనలో భాగంగా సిద్ధవటం కోట, ఆలయం, పరిసర ప్రాంతాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ . వైయస్సార్ కడప జిల్లాలో పవిత్ర పెన్నా నది ఒడ్డున ఉన్న సిద్ధవటం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం సిద్ధవటం ప్రాంతాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. సిద్ధవటంలో పర్యాటకంగా అభివృద్ధి

వార్త‌లు

గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజం జయంతి

జాతీయ గణిత దినోత్సవాన్ని ఉండ్రాజవరం మండలంలోని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉండ్రాజవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి  బౌద్ధ ధమ్మ పీఠాధిపతి భంతే అనాలయో సుంకవల్లి ట్రస్ట్  డాక్టర్ సుంకవల్లి సూర్యనారాయణలు ముఖ్యఅతిధులుగా పాల్గొని ప్రసంగించారు. గణిత ఉపాధ్యాయులు  ఆళ్ల సుబ్బారావు, దమయంతి, నూర్జహాన్ బేగం, నాగజ్యోతి, వెంకటేశ్వరరావు, పద్మజరాణి  పాల్గొని వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు  బహుమతి ప్రదానం చేశారు. గణిత శాస్త్రవేత్తగా శ్రీనివాస రామానుజం సేవలు, గణితం యొక్క ప్రాధాన్యత వివరించారు.

వార్త‌లు

నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు నూతన చైర్మన్ గా ఎన్నికైన పలుకూరి కాంతారావు

పల్నాడు, గుంటూరు,ప్రకాశం,బాపట్ల జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు నూతన చైర్మన్ గా ఎన్నికైన పలుకూరి కాంతారావు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా టిడిపి నేతలు. జూలకంటి బ్రహ్మారెడ్డి కామెంట్స్.. కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమ కోసం ముందుగా నీటి సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది.30 సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేసిన కాంతారావు గారిని చైర్మన్ గా ఎన్నుకోవడం సంతోషం. 5 సంవత్సరాలుగా కాలువలో పూడికలు తీయలేని పరిస్థితుల్లో

వార్త‌లు

నరసరావుపేట జగనన్నకాలనీ భూములను రీ సర్వే చేయాలని ఆర్డీవో ఆదేశాలు

వినుకొండ రోడ్ లో ఉన్న జగనన్న కాలనీ భూములను రీ సర్వే చేయాలని ఆర్డీవో ఆదేశాలు ఈ సందర్భంగా శనివారం ఆర్డిఓ మధులత, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తహసిల్దార్ వేణుగోపాల్ జగనన్న కాలనీ భూములను పరిశీలించారు. కాలనీలో మొత్తం భూములను రీ సర్వే చేయాలని తాహసిల్దార్ కు, ఆర్డిఓ ఆదేశాలు ఇచ్చారు. వాగు పోరంబోకు భూములు ఏమైనా ఉంటే తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, చెరువు,కుంటలు భూములను ప్రభుత్వం వదిలేది లేదని

వార్త‌లు

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 20 మంది బాధిత లబ్ధిదారులకు ఒకేసారి రూ.15 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నిడదవోలులోని స్థానిక మంత్రి కార్యాలయంలో ఈ మేరకు లబ్ధిదారులతో ఆరోగ్య పరిస్థితుల వివరాలను తెలుసుకొని చెక్కులు అందించారు. కష్టంలో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులుతో ఆర్థికసాయం అందజేసిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకి ఈ

వార్త‌లు

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాసరావు

ద్విచక్ర వాహనదారులు ప్రయాణించు సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలని ఉండ్రాజవరం ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాలంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు త్రిబుల్ రైడింగ్, వేగపరిమితి, హెల్మెట్ ధారణ, మైనర్లకు వాహనాలు ఇవ్వటం తీవ్రమైన ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని అవగాహన కల్పించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను వాహనదారుడు తన దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

వార్త‌లు

తణుకు బైపాస్ రోడ్ వద్ద యాక్సిడెంట్ – వ్యక్తి మృతి

తణుకు నుండి పెరవలి వైపు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) మోటార్ సైకిల్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతదేహం నుజ్జునుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వార్త‌లు

వేండ్ర శ్రీనివాసరావు మరణం యు.టి.ఎఫ్ సంఘానికి తీరనిలోటు

ఉండ్రాజవరం M.V. N.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ (P.S.) ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 25-11-2024న గుండెపోటుతో మరణించిన వేండ్ర శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు UTF తూర్పుగోదావరిజిల్లా కుటుంబ సంక్షేమనిధి నుండి మూడు లక్షల రూపాయల సంఘీభావ విరాళమును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వేండ్ర శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. ఆయన చనిపోవడం యు టి ఎఫ్ సంఘానికి తీరనిలోటని, ఒక మంచి ఉపాధ్యాయున్ని కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ఎస్

వార్త‌లు

యు.టి.ఎఫ్ SSC స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

ఉండ్రాజవరం మండల వనరుల కేంద్రం వద్ద UTF ఉండ్రాజవరం మండల శాఖ నిర్వహించిన కార్యక్రమంలో UTF, SSC స్టడీ మెటీరియల్ ను మండల విద్యాశాఖ అధికారి నెం.1, CH. సక్సేనారాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఐ. రాంబాబు, మండల గౌరవ అధ్యక్షులు క్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు శ్రీ వైవీ స్వామి, మండల అసోసియేట్ అధ్యక్షులు యస్ తాతారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బెజ్జంకి రామారావు, కుటుంబ సంక్షేమ పథక డైరెక్టర్ శ్రీ ఆర్ ఎస్

Scroll to Top