తణుకులో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వైసీపీ ప్రచార రథంపైకి ఎక్కి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కారుమూరి కారులోనే ఉండిపోయారు.
