పెళ్లికి ముందు ఆ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని..హీరో నాని

పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని’ అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరెకెక్కించిన ‘హిట్- 3‘ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం హాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
15 ఏళ్ల క్రితం వైజాగ్‌లో తిరిగిన విషయాల్ని నాని గుర్తుచేసుకున్నారు. ‘నా పెళ్లికి ముందు దాదాపు 15ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడని. తర్వాత ఆ ఆమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. నాకు వైజాగ్‌తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. అప్పుడైనా, ఇప్పుడైనా వైజాగ్‌కు వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్లినా నన్ను వాళ్లు అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ, వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు’ అంటూ నాని తన భార్య గురించి, వైజాగ్‌తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రయత్నాలు చేసిన ప్రతీసారి తెలుగు ప్రేక్షకులు ఆదిరించారని నాని అన్నారు. ‘హిట్- 3 అనేది కొత్త జానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనడానికి వంద ఉదాహరణలు ఉన్నాయిని వచ్చే మే 1న మీరు, నేను మనమంతా గెలుస్తామన్న నమ్మకం ఉంది’ అని నాని అన్నారు. అనంతరం సినిమాలో డైలాగ్ తో నాని అభిమానులును అలరించారు.