ఆధ్యాత్మికం

నిడదవోలు శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల వేడుకలు ముగింపు

నిడదవోలు: కోట సత్తెమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్ల చివరిరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తిరునాళ్ల చివరిరోజు సందర్బంగా బాణసంచా కాల్చి, వివిధ వేషధారణల్లో భక్తులు ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు దంపతులు హాజరయ్యారు. అదేవిదంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పాలకవర్గం సభ్యులు తిరునాళ్ల ఏర్పాట్లను సమర్థంగా […]

ఆధ్యాత్మికం

గీతాజయంతి రోజు ఉచితంగా లక్ష భగవద్గీత పుస్తకాలు – గీతారత్న మండ విజయ్ కుమార్ శర్మ

విశాఖలో గీతా జయంతి సందర్భముగా గీతాఛానల్ ఫౌండేషన్, హైందవి ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష విద్యార్థులతో 100శ్లోకాలు,1000 స్కూల్స్ లో యువ గీత పారాయణం చేయించడం జరిగింది. గీతాఛానల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతా రత్న మండ విజయ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్, జడ్పీ హై స్కూల్, వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలలో విశాఖ డిఏవి పబ్లిక్ స్కూల్ లో నిర్వహించడం విశేషం. విజయ కుమార్ శర్మ డిఏవి పబ్లిక్ స్కూల్ లో మాట్లాడుతూ భగవద్గీత

ఆధ్యాత్మికం

అత్తిలి శ్రీ వల్లీ,దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ విశేషాలు

పూర్వం ఇప్పుడున్న ఆలయ ప్రాంగణంలో ఉన్న చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. అందులో దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం నిత్యం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం ఇక్కడి వారు చూసేవారట – మాములుగా మన ఇంట్లో కి వస్తే తప్ప లేకుంటే పాముని మనం పవిత్రంగా పూజిస్తాం కాబట్టి ఆ భావన కలగడం వలన గ్రామస్థులు ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదట – కొన్ని రోజులకి ఆ చెరువులో నీరు పెరగడం

ఆధ్యాత్మికం

నిడదవోలు కోటసత్తెమ్మను దర్శించుకున్న పోలీస్ ఉన్నతాధికారులు

తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్న ఏలూరు రేంజ్ ఐ.జి. అశోక్ కుమార్, ఆయనతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్ .వి.మురళీకృష్ణ, కొవ్వూరు డి.ఎస్.పి దేవకుమార్, నిడదవోలు సీఐ తిలక్, ఎస్సైలు శోభనకుమార్, జీ. సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బంది పొలీస్ అధికారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

ఆధ్యాత్మికం

తిరుచానూరులో గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. గరుడసేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా

ఆధ్యాత్మికం

కార్తీక పౌర్ణమి రొజున పూర్తైన ఆప్త వాజపేయ మహాయాగం

నవంబర్ 1 నుండి 15వ తేదివరకు జరుపబడిన ఆప్తవాజపేయం మహాయాగం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో చివరి రోజు కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు వేలాదిగాతరలివచ్చారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం, యాగశాల, స్వామి అమ్మవార్లను దర్సించుకుని, కొటికుంకుమార్చన జరిపిన కుంకుమను మహిళాభక్తులు స్వీకరించారు. అనంతరం భక్తులు ప్రాంగణంలో జరుపబడిన అఖండ అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

Scroll to Top