ఇళ్లస్థలాల కోసం డబ్బులు వసూలు చేసిన వైసీపీ నేతలు

ధనార్జనే ధ్యేయంగా కమిషన్లు కోసం కక్కుర్తి

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు

ఇరగవరం మండలంలో సుపరిపాలనలో తొలిఅడుగు

గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని లబ్థిదారుల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇచ్చిన స్థలాలు సైతం ఎందుకు పనికి రాకుండా కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయని లబ్థిదారులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఇరగవరం మండలం అయితంపూడి, పేకేరు గ్రామంల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమం, అభివృద్ధి అడిగి తెలుసుకున్నారు. కమిషన్ల కోసం ధనార్జనే ధ్యేయంగా అన్యాయంగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అందజేయాలని ఇప్పటికే చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఇందుకు సంబంధించి లబ్థిరుల జాబితాలను తయారు చేస్తున్నామన్నారు. సంక్షేమాన్ని ప్రణాళిక ప్రకారం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అయితంపూడి, పేకేరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబునాయుడు సుపరిపాలన అందించేందుకు ముఖ్యంగా యువత భవిష్యత్తును మరింత ఉన్నత స్థితికి తీసికెళ్లేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా టెక్నాలజీను అనుసంధానం చేసుకుని వాట్సప్‌ గవర్నెన్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చి సుమారు 547 సేవలను పొందుపరిచామన్నారు. నియోజవకర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link