ఏవరైనా లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, అటువంటి సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి హెచ్చరిక.
పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది . దీనిలో భాగంగా తాడేపల్లిగూడెంలోని రవి మాధవ్ నర్సింగ్ హోమ్, విజయ హాస్పిటల్, ముళ్లపూడి వెంకటరమణ మెమెరియల్ హాస్పిటల్, తణుకు పట్టణంలోని ముళ్ళపూడి కార్డియో వాసుక్యూలర్ సెంటర్, యునైటెడ్ డయాగ్నస్టిక్ సెంటర్, శ్రీ తేజ హాస్పిటల్ తనిఖీలు నిర్వహించి APMCE చట్ట పరిధిలో ఆసుపత్రులు నిబంధనలు పాటించుచున్నది లేనిది ఆయా ఆసుపత్రులు రికార్డులు పరిశీలించడం జరిగినది. అదేవిధంగా PCPNDT చట్ట పరిధిలో స్కానింగ్ సెంటర్ల నిర్వహణ పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగినది. ఏవరైనా లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.