బుధవారం తణుకు పట్టణంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా పట్టణ ప్రధాన రహదారిలో తమ పార్టీకి చెందిన ప్రచార రథం పై పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు చేసిన దాడి పట్ల గురువారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు. వైసీపీ పార్టీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమ నిమిత్తం వెళుతున్న తమ ప్రచార రథాన్ని ర్యాలీగా వెళుతున్న జనసైనికులు ప్రచార రథం పై ఎక్కి రణరంగం సృష్టించారని ప్రచార రథం పై ఉన్న జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని తొక్కుతూ, చాలా నీచంగా హేయంగా ప్రవర్తించారని అన్నారు. ఈ దేశంలో చాలామంది సినీ నటుల చిత్రాలు విడుదలవుతూ ఉంటాయని రిలీజ్ ఫంక్షన్లు ర్యాలీలు చేసుకుంటూ ఉంటారు తప్పులేదు కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా తణుకులో బైకుల యొక్క సైలెన్సర్లు తీసి ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా విధ్వంసం సృష్టించారని ఆయన అన్నారు. ఎంతోమంది హీరోలు సినిమాలు విడుదలవుతున్న ఈ విధంగా బీభత్సం, విధ్వంసం చేయలేదని ప్రత్యేకించి ఈ హీరో అభిమానులే ఈ విధంగా చేస్తున్నారని అన్నారు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి వాళ్లకు చేసిన అన్యాయం ఏమిటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పార్టీలకు అతీతంగా కులాలకు ప్రాంతాలకు, మతాలకు అతీతంగా ప్రతి పథకాన్ని అందరికీ అందించాలని అన్నారని, అందరికీ మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. బ్రాహ్మణులకు, రాజులకు, కాపులకు పెన్షన్ ఇచ్చారని, అదేవిధంగా కాపు నేస్తం అందించారని, కాపుల లో ఉండే రైతులకు, ఆటో వాళ్లకు, తోపుడుబండ్ల, మిషన్ కుట్టుకునే వారికి ఆర్థిక సాయం అందిందని, ఏ ఒక్కరికి ఎవరికీ తక్కువ చేయకుండా సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. ఎందుకు మీకు జగన్ అంటే కక్ష మీ నాయకుని పై అభిమానం ఉంటే ర్యాలీలు చేసుకోండి తప్పులేదు, కాని జగన్ పై ద్వేషం ఎందుకు అని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ తమకు లేదని అన్నారని, జనసేనలో సిద్ధాంతాలు తను చెప్పిన వాటిపై నమ్మకం ఉన్నవారు మాత్రమే కొనసాగాలని సాక్షాత్తు పార్టీ అధినాయకుడే అన్నాడని, ఇష్టం లేనివారు వెళ్ళిపోవచ్చని, తెలుగుదేశం వారిని అనకూడదని అన్నారని, ఇప్పుడు నేను అడుగుతున్నాను జనసేన 15 సంవత్సరాల పాటు కూటమి నాయకులతోటే ఉంటానని అధినాయకుడే స్పష్టం చేశారని, వీరి నాయకుడు ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేద, పోరాటం చేయటం మాత్రమే నాకు తెలుసు, పరిపాలన చంద్రబాబు నాయుడుకి మాత్రమే తెలుసు ఆయనే ఉండాలి ముఖ్యమంత్రిగా అంటున్నారని కారుమూరి అన్నారు. తణుకు నియోజకవర్గంలో అందరి వాడిగా చలామణి అవుతూ రంగా విగ్రహాన్ని తణుకులో ఏర్పాటు చేశానని, పోలిశెట్టి గోపి విగ్రహాన్ని అదేవిధంగా వంగవీటి మోహన రంగా రహదారిగా మార్చానని… చాలా ప్రాంతాలలో గ్రహాలు విగ్రహాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేశానని ఈ విధంగా ఏమి తక్కువ చేసామని ప్రశ్నించారు కారుమూరి. ఈ నియోజకవర్గంలో కారుమూరి అందరివాడుగా ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేశానని ఈరోజు ఆ పరిస్థితి తణుకులో లేదని ఏకపక్ష విధానంతో పరిపాలన జరుగుతుందని… ప్రతి దానికి వసూళ్లు టాక్స్లు పడుతున్నాయని….. ఈ దుస్థితిలో వారి తల్లిదండ్రులను అడుగుతున్నాను ఇది మంచి సాంప్రదాయమా …. జగన్మోహన్ రెడ్డి ఏమి తక్కువ చేశారు, మీ నాయకుడు సంవత్సరకాలంలో ఏమి ఇచ్చారు మీకు కారుమూరి ప్రశ్నించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో మేము వెళుతున్న ప్రతి ఇంటిలో మరల జగన్ రావాలని జగన్ కావాలని అంటున్నారని కారుమూరి అన్నారు. తణుకులో లా అండ్ ఆర్డర్ లేదని రాచరిక పాలన నడుస్తుందని తనపై దాడి చేస్తేనే రక్షణ లేని పరిస్థితి ఎక్కడ ఉందని కారుమూరి అన్నారు. పోలీసు వ్యవస్థ కూడా మారాలని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కారుమూరి కోరారు.
