వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం

  • జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
  • రాజమహేంద్రవరం నగర ప్రజలు, జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగు నీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యలు, ధ్రువీకరణ పత్రాల వంటి వివిధ సమస్యలను నేరుగా తెలియజేయేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబరు ” 98666 57600 ” ను అందుబాటులోకి తీసుకొ చ్చినట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) శ్రీమతి పి. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
  • 98666 57600 నెంబరుకు నగర, జిల్లా పౌరులు తమ పేరు, సమస్య వివరాలు, నివాస ప్రాంతం సమాచారం సహా సందేశం పంపితే, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు.
  • ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్న కలెక్టర్, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Scroll to Top
Share via
Copy link