ఇండియన్ ఆర్మీకు వాసవి మాత ఆశీస్సులు ఉండాలి
వాసవి మాత జయంతి ఉత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఇండియన్ ఆర్మీకు వాసవి మాత కటాక్షం ఉండాలని కోరారు. వాసవి మాత జన్మదినం పురస్కరించుకుని తణుకులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవమునకు హాజరై ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల స్థావరాలను కూలగొట్టడానికి ఇండియన్ ఆర్మీ చేస్తున్న కృషిని అభినందించారు. ఎన్నో అన్యాయాలను ఎదుర్కొని నిలబడిన వాసవి మత ఆత్మార్పణం చేసుకొని ఎంతోమందికి ఇలవేల్పుగా ఉన్నారని పేర్కొన్నారు. వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరికీ కటాక్షించాలని ఆయన ఆకాంక్షించారు. కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.