వార్త‌లు

చివటం సుపరిపాలన తొలిఆడుగులో పాల్గొన్నమంత్రి గొట్టిపాటి

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి కుమార్ మరియు APIIC చైర్మన్ మంతెన రామరాజు. ఈ కార్యక్రమం లో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, […]

వార్త‌లు

త్వరలో జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు…

మద్యం కుంభకోణంలో రూ. 3500 కోట్లు అవినీతి భుజాలు తడుముకుంటున్న వైసీపీ నాయకులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘాటు విమర్శలు మద్యం కుంభకోణంలో జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగిందన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 7, 8 వార్డుల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికీ పర్యటించి గత ఏడాదిగా

వార్త‌లు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు తలసేమియా రన్

*. విశాఖపట్నం: జూలై 19 (కోస్టల్ న్యూస్)విశాఖలోని రామకృష్ణా బీచ్‌రోడ్డులో ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటలకు తలసేమియా రన్‌ నిర్వహించనున్నారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కోసం ఈ రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి వస్తున్నారు. తలసేమియా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి. దీనితో బాధపడే పిల్లలకు ప్రతి 21 రోజులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మంది రక్తదానం చేస్తే ఆయా పిల్లలకు

వార్త‌లు

శాకాంబరీ అవతారంలో సజ్జాపురం ఏవులమ్మ

కొమ్మిరెడ్డి వారి ఆడపడుచు, మాకినేడి వారి కోడలు అయిన సజ్జాపురం గ్రామదేవతశ్రీశ్రీశ్రీ ఏవులమ్మ అమ్మవారు ఆలయంలో శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఈరోజు వివిధ రకాల కూరగాయలతో ఏవులమ్మ అమ్మవారిని శాకంబరీగా అలంకరించడం జరిగినది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి నూతన వస్త్రములు సమర్పించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదములు స్వీకరించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్న తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా: ముళ్ళపూడి రేణుక. ఈ

వార్త‌లు

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు

విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సి ఉంది చంద్రబాబు వృద్ధాప్యంలో ఉన్నారంటూ వ్యాఖ్యలు సరికాదు సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రాష్ట్ర మంతి టి.జి.భరత్‌ విమర్శలు ఎమ్మెల్యే రాధాకృష్ణతో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి భరత్‌ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్‌ అన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారానే ఆ ప్రాంతం తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.

వార్త‌లు

అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ ఏర్పాటు అభినందనీయం

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభం తణుకులో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే విధంగా సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. హైదరాబాదు తర్వాత తణుకులోనే పుల్లెల గోపీచంద్‌ అకాడమీను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందు చూపుతో చిట్టూరి సుబ్బారావు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో చిట్టూరి సుబ్బారావు అండ్‌ గోపిచంద్‌ బ్యాండ్మింటన్‌ అకాడమీలో జిల్లా

వార్త‌లు

అమ్మవార్లకు సారె సమర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు

దువ్వ గ్రామంలో కావిడి మోసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆషాడమాసం పురస్కరించుకొని తణుకు మండలంలో వేంచేసిన పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సతీమణి కృష్ణ తులసి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని సతీసమేతంగా అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అనంతరం తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి

వార్త‌లు

స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ లేకపోతే చర్యలు తప్పవు

స్కూల్ బస్సు ప్రమాద విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ స్కూల్ బస్సులు ఫిట్ నెస్ లేకుండా నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు దీన్ని బాధ్యతగా తీసుకొని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇరగవరం మండలంలో గురువారం జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రమాద సమయంలో 25

వార్త‌లు

జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేసిన వైసిపి

కాలనీలో సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు ఇరగవరం మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగ గత వైసిపి ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలంలో కట్టించి ఇచ్చిన కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం అయినపర్రు, ఓగిడి గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించి గత ఏడాదికాలంగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు.

వార్త‌లు

ఏపీఎస్ జేఏసీ ఉమ్మడి గోదావరి జిల్లాల నూతన కో కన్వీనర్ గా ఎన్నికైన ఆకుల రవీంద్ర

తణుకు పట్టణంలో ఒక ప్రైవేట్ కళాశాలలో గురువారం జరిగిన ఏపీఎస్ జేఏసీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర చైర్మన్ కృష్ణ యాదవ్ అదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆధ్వర్యంలో తణుకు పట్టణానికి చెందిన ఆకుల రవీంద్ర నూతన ఉమ్మడి గోదావరి జిల్లాల కో కన్వీనర్ గా ఎన్నిక అవడం జరిగింది. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాల కన్వీనర్ చివటం శివ మాట్లాడుతూ ఆకుల రవీంద్ర విద్యార్థి ఉద్యమంలో మరింత ముందుకు సాగాలి అని, విద్యార్థుల సమస్యల

Scroll to Top