*. విశాఖపట్నం: జూలై 19 (కోస్టల్ న్యూస్)విశాఖలోని రామకృష్ణా బీచ్‌రోడ్డులో ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటలకు తలసేమియా రన్ నిర్వహించనున్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కోసం ఈ రన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి వస్తున్నారు. తలసేమియా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి. దీనితో బాధపడే పిల్లలకు ప్రతి 21 రోజులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మంది రక్తదానం చేస్తే ఆయా పిల్లలకు సాంత్వన లభిస్తుంది. దీనిపై అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.అనంతరం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చే సంగీతావిభవరి ఉంటుంది.
