ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్ని తనదైనశైలిలో ముందు చూపుతో ముందుకు నడిపించిన దిగ్గజం, తణుకు పట్టణాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానుభావుడు, కళాప్రపూర్ణ, అందరూ ముద్దుగా పిలుచుకునే ఆంధ్ర బిర్లా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105 వ జయంతి సందర్భంగా
తణుకు పాతఊరు సానబోయిన , మున్సిపల్ ఆఫీసు వద్ద గల విగ్రహాల వద్ద ఏర్పాటుచేసిన సభలో డా. ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ (హరిబాబు)తో పాల్గొని తాతయ్య చెప్పినటువంటి మంచి మాటలు, చేసినటువంటి మంచి పనులు గుర్తుకు తెచ్చుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడమైనది.