తణుకు, జూలై 28, 2025 : కీ.శే. “శర్కర కళాప్రపూర్ణ” డా.ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 104 వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక రోటరీ క్లబ్ వత్సవాయి వెంకట రాజు, సత్యవతి భవనం లో శ్రీ చక్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్న పిల్లల వైద్య శిబిరం నిర్వహించారు.
రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకట కృష్ణారావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత కలగర వెంకట కృష్ణారావు, రోటరీ క్లబ్ నాయకులు, సభ్యులు కీ.శే. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ వైద్య శిబిరంలో శ్రీ చక్ర హాస్పిటల్ వైద్యురాలు, చిన్న పిల్లల, నవజాత శిశువుల వైద్య నిపుణురాలు డా.నల్లపాటి అనూష సుమారు వందమంది పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ఇచ్చారు. రోటరీ క్లబ్ సభ్యులు శ్రీయుతులు మల్లిన అరుణ సారధి, అనపర్తి ప్రకాశరావు ల సౌజన్యంతో ఈ ఉచిత చిన్న పిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వైద్య శిబిరం జరిగింది.
ఈనాటి ఈ వైద్య శిబిర కార్యక్రమానికి హాజరైన అతిథులకు రోటరీ క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్ స్వాగతం పలికారు. ఈ వైద్య శిబిరం శ్రీ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపోజు దినేష్ బాబు పర్యవేక్షణలో నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో జిల్లా బి.జె.పి. అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరరావు, తణుకు టి.డి.పి. అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, రోటరీ మాజీ అధ్యక్షులు బసవా రామకృష్ణారావు, ఆనందం మస్తాన్ రావు, వంగూరి హనుమంత రావు, రోటరీ క్లబ్ సభ్యులు గమిని రాంబాబు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, పోతుల శ్రీనివాస్, ఏ. ప్రసాదరావు, రిటైర్డ్ ఎస్.ఐ. బోడపాటి ప్రసాద్, అక్కిన కాశీ విశ్వనాథం, గెడా రామకృష్ణ, రెడ్డి రంగారావు, శ్రీ చక్ర హాస్పిటల్ పి.ఆర్.ఓ. నేకూరి మధు, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా.నల్లమాటి అనూష కోట రామ ప్రసాద్ తో మాట్లాడుతూ, చిన్న పిల్లలకు పుట్టిన నాటి నుండి పిల్లలు ఎదిగేవరకు అనేక రకాల టీకాలు, చుక్కలు వయసును అనుసరించి వేయించాలని వివరించారు. చిన్న పిల్లలకు సంబంధిన టీకాలు, ఏ వయసులో ఏ టీకాలు, చుక్కలు వేయించాలో తెలిపే చార్ట్ ఉంటుందనీ, ఆ చార్ట్ ను అనుసరించి టీకాలు, చుక్కలు పిల్లలకు వేయించాలని డా.నల్లమాటి అనూష వివరించారు.