సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం ప్రాంగణంలో పేరెంట్స్ డే ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ భవితకు భరోసా జీవితానికి దిక్సూచి తోడునీడగా ఉండేది అమ్మానాన్నలే అని అన్నారు. పేరెంట్స్ డే సందర్భంగా సాహితీ సామ్రాజ్యం సంస్థ సన్మానం అందుకున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు సన్మాన గ్రహీత ఆలపాటి సుబ్బారావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లికి నడత నేర్పిన తండ్రికి కనిపించే దేవుళ్ళుగా మనం కీర్తించుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వక్తలు తల్లిదండ్రుల ఆవశ్యకత, బంధాల గురించి విశదీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరిండెంట్ మంగు సూర్యప్రకాష్, కార్యాలయ సిబ్బంది మారాల సురేష్ కసిరెడ్డి శివప్రసాద్, బేతా వరలక్ష్మి పాల్గొనగా, సభ్యులు బంధాల సుధారాణి, బేతాదుర్గ కమలంపూడి గౌరీ కుమారి, పి.సత్యనారాయణ, మడ్లపల్లి శివప్రసాద్, జి. గంగాధర సత్యనారాయణ మూర్తి, ఆర్. సత్యనారాయణ, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
