కొమ్మిరెడ్డి వారి ఆడపడుచు, మాకినేడి వారి కోడలు అయిన సజ్జాపురం గ్రామదేవత
శ్రీశ్రీశ్రీ ఏవులమ్మ అమ్మవారు ఆలయంలో శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఈరోజు వివిధ రకాల కూరగాయలతో
ఏవులమ్మ అమ్మవారిని శాకంబరీగా అలంకరించడం జరిగినది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి నూతన వస్త్రములు సమర్పించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదములు స్వీకరించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్న తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా: ముళ్ళపూడి రేణుక. ఈ కార్యక్రమంలో బిజెపి తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, సీనియర్ నాయకురాలు గంటా లక్ష్మి, తణుకు పట్టణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చేమూరి నాగ మల్లిక, సుజాత, బిజెపి నాయకులు పులమాల వీరభద్రం, ముప్పిడి సుబ్బయ్య, కోడే భాస్కర్ రావు, కొడమంచిలి జితేందర్, తణుకు కాపు సంఘం ఉపాధ్యక్షులు గాజుల కాశి విశ్వనాధం, కాకి శంకర్, బలభద్ర నాగ సూర్య ప్రకాష్ గుప్తా, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
