వార్త‌లు

అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ ఏర్పాటు అభినందనీయం

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభం తణుకులో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే విధంగా సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. హైదరాబాదు తర్వాత తణుకులోనే పుల్లెల గోపీచంద్‌ అకాడమీను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందు చూపుతో చిట్టూరి సుబ్బారావు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు. తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో చిట్టూరి సుబ్బారావు అండ్‌ గోపిచంద్‌ బ్యాండ్మింటన్‌ అకాడమీలో జిల్లా […]

వార్త‌లు

అమ్మవార్లకు సారె సమర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు

దువ్వ గ్రామంలో కావిడి మోసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆషాడమాసం పురస్కరించుకొని తణుకు మండలంలో వేంచేసిన పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సతీమణి కృష్ణ తులసి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని సతీసమేతంగా అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అనంతరం తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి

వార్త‌లు

స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ లేకపోతే చర్యలు తప్పవు

స్కూల్ బస్సు ప్రమాద విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ స్కూల్ బస్సులు ఫిట్ నెస్ లేకుండా నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు దీన్ని బాధ్యతగా తీసుకొని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇరగవరం మండలంలో గురువారం జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రమాద సమయంలో 25

వార్త‌లు

జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేసిన వైసిపి

కాలనీలో సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు ఇరగవరం మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగ గత వైసిపి ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలంలో కట్టించి ఇచ్చిన కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం అయినపర్రు, ఓగిడి గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించి గత ఏడాదికాలంగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు.

వార్త‌లు

ఏపీఎస్ జేఏసీ ఉమ్మడి గోదావరి జిల్లాల నూతన కో కన్వీనర్ గా ఎన్నికైన ఆకుల రవీంద్ర

తణుకు పట్టణంలో ఒక ప్రైవేట్ కళాశాలలో గురువారం జరిగిన ఏపీఎస్ జేఏసీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర చైర్మన్ కృష్ణ యాదవ్ అదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆధ్వర్యంలో తణుకు పట్టణానికి చెందిన ఆకుల రవీంద్ర నూతన ఉమ్మడి గోదావరి జిల్లాల కో కన్వీనర్ గా ఎన్నిక అవడం జరిగింది. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాల కన్వీనర్ చివటం శివ మాట్లాడుతూ ఆకుల రవీంద్ర విద్యార్థి ఉద్యమంలో మరింత ముందుకు సాగాలి అని, విద్యార్థుల సమస్యల

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గం ఏ.ఎం.సి. చైర్మన్ గా గాలింకి జిన్నాబాబు

నిడదవోలు నియోజకవర్గం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన గాలింకి జిన్నాబాబు నియమించబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన స్థానిక నామినేటెడ్ పదవుల్లో భర్తీలో భాగంగా 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లను ఖరారు చేసింది అందులో భాగంగా నిడదవోలు నియోజకవర్గం చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన గాలింకి జిన్నాబాబు ఎంపికైనట్లు తెలిపారు

వార్త‌లు

రైతులకు వ్యవసాయ అధికారులు అండగా నిలబడాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన డీలర్లకు సర్టిఫికెట్లు అందజేత దేశంలో వ్యవసారంగంపై ఆధారపడి అరవై శాతం మంది రైతులు జీవిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అలాంటి రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ఇన్ పుట్ డీలర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల యజమానులు రైతులకు అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన ఇన్ పుట డీలర్లకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు.

వార్త‌లు

తణుకులో ఘనంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో గురువారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితి సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయస్థానం అవసరం పెరుగుతున్న నేపథ్యంలో న్యాయమైన, న్యాయ వ్యవస్థ కోసం కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ మన గౌరవాన్ని కాపాడడానికి న్యాయం ఎంతో అవసరమని నేరాలను ఎదుర్కొనడానికి శాంతిని భద్రపరచడానికి అంతర్జాతీయ చట్టం ఉందని

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నవ శిశువులకు ఉచితంగా కిట్స్ పంపిణీ

తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి యందు గురువారం నవ శిశువులకుఉచితంగా కిట్స్ పంపిణీ జరిగింది. రొ. కే. సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ యందు ప్రసూతి వార్డులో 60 మంది నవ శిశువులకు సున్నితమైన శరీరాలకు ఉపయోగపడే కిట్స్ అనగా సబ్బులు, బేబీ పౌడర్లు, మసాజ్ ఆయిల్ తో కూడుకున్న నాణ్యమైన కిట్స్ వితరణ చేయడం జరిగిందని రోటరీ కార్యదర్శి జి.సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్

వార్త‌లు

ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం

ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్ లో ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ “సామల లక్ష్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారు నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్లో వెంపటాపు” if i were to be borne tomorrow “శీర్షిక తో చిత్ర రచన చేసిన చిత్రానికి పదివేల రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది ఈ నెల 14,15,16 తేదీలు నెహ్రూ ఆర్ట్ గేలరీ హైదరాబాద్ లో

Scroll to Top