తణుకులో ఘనంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో గురువారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితి సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయస్థానం అవసరం పెరుగుతున్న నేపథ్యంలో న్యాయమైన, న్యాయ వ్యవస్థ కోసం కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ మన గౌరవాన్ని కాపాడడానికి న్యాయం ఎంతో అవసరమని నేరాలను ఎదుర్కొనడానికి శాంతిని భద్రపరచడానికి అంతర్జాతీయ చట్టం ఉందని ఈరోజు గుర్తుచేస్తుంది అన్నారు. న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయం న్యాయవ్యవస్థ అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పలువురు న్యాయవాదులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ తదితరులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాపాక ప్రభాకర్, చింతపల్లి నాగేశ్వరరావు, ఇంకొలు పవన్, ఉండ్రాజవరపు గెరటరాజు, ఎంపీ సంతోష్ మరో పాత్రో, ఎస్ జి ఆర్ భాగ్యానందం, ఏమని సిద్దేశ్వర ప్రసాద్, ఘనసాల సుధీర్ బాబు, సామాజిక న్యాయపోరాట సమితి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, పెన్షనర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, నున్న వెంకట రామారావు, ఆలపాటి సుబ్బారావు, అకెళ్ళ సుబ్రహ్మణ్యం, అర్జీ భాస్కరరావు, మంగు సూర్యప్రకాష్, ముక్కామల మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link