తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన డీలర్లకు సర్టిఫికెట్లు అందజేత
దేశంలో వ్యవసారంగంపై ఆధారపడి అరవై శాతం మంది రైతులు జీవిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అలాంటి రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ఇన్ పుట్ డీలర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల యజమానులు రైతులకు అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిప్లమో కోర్సులో ఉత్తీర్ణులైన ఇన్ పుట డీలర్లకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గురువారం తణుకులోని చిట్టూరి హెరిటేజ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంటకు ఏదైనా తెగులు సోకిన సమయంలో ఏ మందు వినియోగించాలి అనే సలహాలు సూచనలు రైతులకు ఇవ్వాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సధించే విధంగా వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. లక్ష్యాలు పూర్తిచేసే ఉద్దేశంతో రైతులకు అనవసరమైన పెస్టిసైడ్స్ ఇవ్వకుండా వారికి సరైన మందులు అందజేయాలని కోరారు. డిప్లమా కోర్సులో 36 మంది ఇన్ పుట్ డీలర్లు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.