తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి యందు గురువారం నవ శిశువులకుఉచితంగా కిట్స్ పంపిణీ జరిగింది. రొ. కే. సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ యందు ప్రసూతి వార్డులో 60 మంది నవ శిశువులకు సున్నితమైన శరీరాలకు ఉపయోగపడే కిట్స్ అనగా సబ్బులు, బేబీ పౌడర్లు, మసాజ్ ఆయిల్ తో కూడుకున్న నాణ్యమైన కిట్స్ వితరణ చేయడం జరిగిందని రోటరీ కార్యదర్శి జి.సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్, రోటరీ సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ పోతుల శ్రీనివాసరావు, హాస్పిటల్ ఆర్.ఎం.జి. డాక్టర్ తాతారావు, పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ రాజేశ్వరి రొ. కే.సిద్దార్థరాజు, ఆకెళ్ళ సుబ్రమణ్యం, వి.వి. హనుమంతరావు, వి. పార్వతి, గడా రామకృష్ణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
