ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్ లో ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం అందుకున్నారు.
హైదరాబాద్ “సామల లక్ష్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారు నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్లో వెంపటాపు
” if i were to be borne tomorrow “
శీర్షిక తో చిత్ర రచన చేసిన చిత్రానికి పదివేల రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది
ఈ నెల 14,15,16 తేదీలు నెహ్రూ ఆర్ట్ గేలరీ హైదరాబాద్ లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ లో భాగంగా పదహారో తేదీన జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో వెంపటాపు నగదు పురస్కారం జ్ఞాపిక ప్రశంసా పత్రం అందుకున్నారు
వెంపటాపు తన చిత్రం ” if i were to be borne tomorrow ” గురించి వివరిస్తూ
ఈ భూమి మీద పుట్టాలి అనుకునే ప్రతి బిడ్డ అమ్మ కడుపులో ఉండగానే…
ఓ మొక్క నాటిన తర్వాతే పుట్టాలి….
అంతటి ఘోరమైన పరిస్థితులు
భూ వాతావరణం లో భవిష్యత్తులో ఏర్పడబోతున్నాయని తన చిత్రరచన చేశానని చెప్పారు…
కాలుష్యం అయిపోతున్న భూమి అణుబాంబు లా మారబోతుందని వివరించారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథి
డాక్టర్ మామిడి హరికృష్ణ
డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ &కల్చర్.
జీవి శ్యామ ప్రసాద్ లాల్,
జాయింట్ సెక్రెటరీ, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల రెసిడెన్షియల్.
చెరల నారాయణ,చైర్మన్, కలయిక ఫౌండేషన్.
రేవతి సామల,
ప్రిన్సిపల్,సామల లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
మరియు హైదరాబాద్ లోని పలువురు చిత్రకారులు డాక్టర్ వెంపటాపునకు నగదు పురస్కారం అందించి అభినందించారు
వెంపటాపునకు ఆల్ ఇండియా నగదు బహుమతి రావడం పట్ల స్వగ్రామం ఇరగవరం లోని ప్రముఖులు,
తణుకు పట్టణ ప్రముఖులు అభినందించారు