దువ్వ గ్రామంలో కావిడి మోసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఆషాడమాసం పురస్కరించుకొని తణుకు మండలంలో వేంచేసిన పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సతీమణి కృష్ణ తులసి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని సతీసమేతంగా అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అనంతరం తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు గ్రామంలో భారీ తరలివచ్చిన మహిళలతో కలిసి కావిడి మోసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు అనంతరం అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.