విధుల నుంచి తొలగింపు
శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాధర్ హుండీ సొమ్మును తస్కరిస్తూ బుధవారం పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా కార్యనిర్వాణాధికారి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు బుధవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో కార్యనిర్వాణా అధికారి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆలయ పరిచారకుడు హెచ్. విద్యాధర్ దేవాలయములోని రత్నగర్భగణపతి స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్న క్లాత్ హుండీ వద్ద అనుమానాస్పదంగా ఉండటాన్ని నిర్వాహణాధికారి గుర్తించారు. వెంటనే వెళ్లి ఆకస్మిక తనిఖీ చేయాలని భద్రతా విభాగం పర్యవేక్షణకులను ఇన్చార్జి ముఖ్య భద్రతాధికారి మల్లికార్జునను ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీలో హెచ్. విద్యాధర నుంచి దొంగిలించిన హుండీ నగదును రూ. 24,220 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పరిపాలన చర్యల్లో భాగంగా సమగ్ర విచారణకు ఆదేశించి
ప్రాథమికంగా విద్యాధర్ ను విధుల నుంచి తొలగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పొలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్మాణాధికారి మాట్లాడుతూ భద్రత చేతుల్లో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్ర పరిధిలో వివిధ ప్రదేశాల్లో మొత్తం 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగిందని, పరిపాలన పరిశీలనలో భాగంగా ప్రతిరోజు కార్యనిర్వాహణాధికారి పలుసార్లు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించటం జరుగుతుంది. విద్యాదర్ సొమ్ము తస్కరించటం సీసీ కెమెరాలు ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఆలయ ప్రధానార్చకులు వీరయ్య స్వామి సహాయ కార్యనిర్వాణాధికారి హరిదాసు ఆధ్వర్యంలో పంచనామాలు నిర్వహించి దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతాపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
