ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా చేయుటకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “నవోదయం 2.0” కార్యక్రమం చేపట్టబడింది. ఈ సందర్భంగా బుధవారం నిడదవోలు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నిడదవోలు మండలంలో గతంలో నాటుసారాయి కేసులు నమోదు కాబడిన మునిపల్లి, కోరుమామిడి, తాడిమళ్ళ గ్రామాలను ‘సి’ కేటగిరీ గ్రామాలుగా వర్గీకరించి గతంలో నాటుసారాయి కేసులలోని నిందితుల యొక్క ప్రస్తుత స్థితిగతులను గ్రామస్థాయి కమిటీల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించడం గత నాలుగు నెలల కాలంలో పైన తెలిపిన గ్రామాలలో ఎటువంటి నాటుసారాయికి సంబంధించిన కేసులు నమోదు కాకపోవడం వలన ప్రస్తుతం పైన తెలిపిన గ్రామాలలో ఉన్న సారాయి నిందితులు వారి జీవనభృతి కొరకు వేరే వృత్తుల్లోకి మారి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని సి.ఐ. జైరాం సతీష్ అన్నారు. సదరు గ్రామాలు నాటుసారాయి రహిత గ్రామాలుగా కావడంతో నిడదవోలు మండలాన్ని నాటు సారాయి రహిత మండలంగా ప్రకటించడమైందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల ఎం.పి.డి.ఒ. వి.ఎస్.వి.ఎల్. జగన్నాథరావు, నిడదవోలు తహసిల్దార్ బి. నాగరాజు నాయక్, సమీశ్రగూడెం సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్.బాలాజి సుందర్ రావు, నిడదవోలు జడ్పిటిసి కే.సూర్యారావు, నిడదవోలు ఎం.పి.పి. టి.తిరుమల భాగ్యలక్మి, నిడదవోలు ఎక్సైజ్ సి.ఐ. జైరామ్ సతీష్, సబ్ ఇన్స్పెక్టర్ ఐ.ఎన్.ఎస్. బాలాజీ, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
