ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ నందు ఏర్పాటుచేసిన మహా ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మంగళవారం శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ (మెడికల్ ట్రస్ట్) నందు ముళ్ళపూడి తిమ్మరాజు హైస్కూల్ నందు 8, 9 ,10 తరగతి చదువుతున్న 72 మంది విద్యార్థిని విద్యార్థులకు దంత విభాగము, కంటి విభాగము, గైనిక్ విభాగములలో ఉచితముగా వివిధ పరీక్షలు జరిపి బాల బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి దంతాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు), సి.ఏ.ఒ. కె.వీరబాబు, ప్రధానోపాధ్యాయులు ఎన్ .పార్థసారధి, ఉపాధ్యాయులు పి. శ్రీనివాసరావు, వై. కృష్ణ ఆదిత్య, వై. జగదీశ్వరి, ఎండి. జమాల్ బాషా అని హాస్పిటల్ డి.ఎం.ఎస్. ఎం.రాజగోపాల్ పాల్గొన్నారు.
