తణుకు పట్టణంలో స్థానిక వేల్పూరురోడ్డు లో ఉన్న ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చే మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (MICU) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ముళ్లపూడి ట్రస్ట్ హాస్పిటల్ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం పొందే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఈ ట్రస్ట్ హాస్పిటల్ నందు కల్పించడం అయిందని అన్నారు.అందులో భాగంగా ఈరోజు పది బెడ్ల MICU ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా హరిబాబు ఈ యొక్క ట్రస్ట్ హాస్పిటల్ బాధ్యత తీసుకున్న తర్వాత తణుకు పరిసర ప్రజలకు ముఖ్యంగా పేద వారందరికీ కూడా తక్కువ ఖర్చుకి అన్ని వైద్య సదుపాయాలు కూడా అందేవిధంగా ఈ యొక్క ట్రస్ట్ హాస్పిటల్ సేవలు అందిస్తుందన్నారు. కిడ్నీ డయాలసిస్ గాని లేదా ఇతర ఐసీయూ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వైద్య సేవలు కూడా ఈ హాస్పిటల్లో కల్పించారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ అనుసంధానంతో ముఖ్యమైన వైద్యసదుపాయాలు అందిస్తామని ప్రముఖ AIG, STAR హాస్పటల్స్ వారందరితో కలిసి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని డైరెక్టర్ శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ తెలియజేశారు.