భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇరగవరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోనికి వచ్చినటువంటి దేశంలో మత చిచ్చు పెడుతూ దేశంలోనే సమైక్యతను భగ్నం చేస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నిటిని మార్చడానికి ప్రయత్నం చేస్తుందని దాన్ని ప్రతిపక్షాలు నిరోధిస్తున్నవేని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారులకు వచ్చిన నాటినుండి ప్రభుత్వరంగసంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతుందని దీనివల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, నిత్యం నిత్యఅవసర ధరలు పెరిగాయని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయుటకు ప్రయత్నా చేసిందని సిఐటియు, కార్మికులు ప్రైవేటీకన్న జరగకుండా పోరాడుతున్నారని అన్నారు. దేశంలో ఎన్నికల విధానాన్ని మార్చటానికి ప్రయత్నాలు చేస్తుందని ఒకటే దేశం ఒకటే మతం ఒకటే ఎన్నిక అనే విధానాన్ని బిజెపి ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని దాన్ని ప్రజలందరూ తిట్టుకొట్టాలని మునిస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జుత్తిగ రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిల్లి కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు గుబ్బల ముత్యాలు, జక్కంచెట్టి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.