సరస్వతి నది పుష్కరాల సందర్బంగా మే 15 వతేది నుండి 26 వ తేది వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు. 35 మంది భక్తులు ఉంటే పుష్కరాల సమయం లో ఏరోజు అయినా బస్సు ఏర్పాటు చేస్తామని, ముందుగా సంప్రదించాలని అన్నారు. పుష్ బ్యాక్ 2+2, టీవీ సౌకర్యం కలిగిన ఈ సూపర్ లక్సరీ బస్సు కు టికెట్ ధర కేవలం 2100 మాత్రమే అని, ఈ బస్సు లు తణుకు లో బయలుదేరి వరంగల్ భద్ర కాళీ మాత, వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, కాళేశ్వరం లోని మహాకాళేశ్వరస్వామి దర్శనం మరియు పుష్కర స్నానం, అనంతరం రామప్ప లోని రామప్ప దేవాలయం దర్శనం చేసుకుని తిరిగి తణుకు చేరే సదవకాశం కల్పించామని ఈ అవకాశం ను తణుకు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు. వివరములకు 63042 10265 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు.ఈ సందర్బంగా సరస్వతి పుష్కర స్పెషల్ బస్సు ల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో గ్యారేజ్ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దయాకర్, సిస్టమ్ ఇంచార్జి సాయికుమార్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్ పాల్గొన్నారు.
