వికసిత్ భారత్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక కోర్టు ఎదురుగా వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పాకిస్థాన్ పై భారత్ విజయం కోసం హనుమాన్ చాలీసా పారాయణం” జరుపబడినది. కుల, మత,పార్టీలకు అతీతంగా జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని దేశానికి రక్షణ కల్పిస్తున్న భారతదేశ సైన్యానికి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగినదని భారతీయజనతాపార్టీ నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బి.జే.పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
