తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు.
తణుకు నియోజకవర్గంలోని
తణుకు పట్టణంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల పారిశుధ్య మెరుగుదలకు కార్యదర్శులు అందరూ దృష్టి పెట్టాలన్నారు. తణుకు నియోజకవర్గంలోని విద్యుత్తు వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు కార్యచరణ మొదలు పెట్టాలన్నారు.తణుకు మండలంలో 36 విద్యుత్తు ట్రాన్స్ఫర్లు అవసరం ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారని అన్నారు. మండలంలో సమస్యల పరిష్కారం కోసం గత మండల సమావేశంలో వచ్చిన సమస్యలను’ ఈ సమావేశంలో ఎంతవరకు సమస్యను పరిష్కారం అయ్యాయి అని గుర్తించాలని అధికారులు కోరారు. ఎమ్మెల్సీ ఓట్లు నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. గతం కంటే ప్రగతి కనిపించేలా అధికారులు నాయకులు సమరంతో పనిచేయాలన్నారు. వచ్చేనాటికి అన్ని మండలాల్లో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ అశోక్ వర్మ, తణుకు జడ్పిటిసి ముళ్ళపూడి అన్నపూర్ణాదేవి, తణుకు ఎంపీడీవో, మండల అధికారులు పాల్గొన్నారు
