భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ నిడదవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నిడదవోలు ఎమ్.ఆర్.ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు వై. భాస్కర్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, నిడదవోలు లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మత్తుపనులు వెంటనే పూర్తి చేయాలని, గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవన నిధులు రూ.3,480కోట్ల రూపాయులు పెండింగ్లో ఉంచిందని దీని వలన చదువులు పూర్తిచేసిన విద్యార్దులు సర్టిఫికేట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. పలు యూనివర్శిటీలలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో గత ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని యాజామాన్యాలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నారు. కావున తక్షణమే పెండింగులో ఉన్నటు వంటి వసతి దీవెన, విద్యా దీవెన విడుదల చేయాలని, అదేవిధంగా జీఓ నెం: 77 వలన పీజి చదువులకు విద్యార్ధులు దూరం అవుతున్నారని వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు. కానీ జిఓ రద్దు గురించి పలుమార్లు అడిగిన వాటి ఊసేలేదన్నారు తక్షణమే జీవో నెం. 77 ని రద్దు చేయాలని, హాస్టళ్ళ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని, సొంత భవనాలు లేకపోవడంతో చాలిచాలని వసతులతో విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్నా క్యాంటీన్లకు ప్రభుత్వం రూ.96 కేటాయిస్తున్నది కానీ భావితరాలు చదువుకునే హాస్టళ్ళకు రోజుకి రూ.53 (కళాశాల), రూ.46 (పాఠశాల) మాత్రమే ఇస్తుంది. ఇవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా రోజుకి మెస్ బిల్లు రూ.100కి పెంచి నెలకు రూ.3,000 పెంచాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షాన విద్యార్థులను మరింత ఐక్యం చేసి పెద్ద ఎత్తులో ఆందోళనకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, మణికంఠ, నరేష్, దినేష్, ఆజాద్, ఆనంద్, వీరేంద్ర, అబ్రహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
