రోటేరియన్ డా. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన వారాంతపు సమావేశానికి ప్రముఖ సామాజిక ప్రముఖ సామాజిక వేత్త డి.వి.వి. ఎస్. వర్మ ప్రధాన వక్తగా విచ్చేసి, “సమాజం – స్వఛ్ఛంద సేవ” అంశంపై మాట్లాడుతూ రోటరీ వేదిక నుంచి స్వఛ్ఛంద సేవ గురించి మాట్లాడమంటే అతిశయంగాఉంటుందేమో అని సందేహం అన్నారు. వ్యక్తిగత సేవకంటే సామూహికంగా, సామాజికంగా సేవ కే ప్రాధాన్యమిస్తూ మొదటిగా మొక్కలు నాటే కార్యక్రమం తణుకులో నలుదిక్కులా చేశానన్నారు. మరుగు దొడ్లు నిర్మింప జేసే ఉద్యమం జిల్లా అధికారులు సహకారంతో సుమారు 4000 మంది మహిళల డిమాండ్ తో కార్యరూపం దాల్చింది. అలాగే అక్షరాస్యతా ఉద్యమం పరంగా ముఖ్యంగా మహిళలకు చిన్నచిన్న పుస్తకాలు ముద్రింపజేసి పంపిణీతో చేసిన సందర్భం, అదోక అక్షర యజ్ణంగా విస్తరించింది. అలాగే డ్వాక్రా మహిళా సంఘాలలో అవగాహన కలిగించి పట్టణాలకు సహితం విస్త్రుతి చెందేలా చేశాము. అలాగే ప్రకృతిని రక్షించే, ప్రకృతితో సహజీవనం చేసే విధానాలు ప్రచారం చేశాము. ప్రకృతి విలయాన్ని వ్యతిరేకించామన్నారు. కార్యక్రమానికి కార్యదర్శి రో.జి.సుధాకర్, రొ. మల్లిన అరుణసారధి, నందిగం సుధాకర్, రొ. వై.ఎస్. సుబ్రహ్మణ్యం, రొ. ఆనందం మస్తాన్ రావు, రొ. అక్కిన కాశీవిశ్వనాధం, రొ.మేడికొండ వెంకటేశ్వరరావు, రొ. అకెళ్ళ సుబ్రహ్యం అలాగే పట్టణంలోని లాయర్లు, అసోసియేషన్ సభ్యులు, లయన్స్ క్లబ్ సామాజిక సేవాతత్పరులు, తదితరులు పాల్గొన్నారు, ఉపాధ్యాయవర్గాలు కూడ పాల్గొన్నారు.
