తేతలి ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ 2.0 ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తేతలి గ్రామ సర్పంచ్ సరేళ్ళ క్రాంతి ప్రియ, తెలుగుదేశం పార్టీ నాయకులు సరేళ్ళ సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకొని ఉత్తమ విద్యార్థులుగా అత్యుత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలకు తద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పథకాలను తెలిపే విద్యా ప్రగతి చక్రాన్ని సర్పంచ్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మ్యాజిక్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మెజీషియన్ గోపాలరెడ్డి తయారుచేసిన చక్రాన్ని గ్రామ సర్పంచ్, తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీ వెంకటలక్ష్మి కూటమి నాయకులు నాయకులు ఆవిష్కరించారు.
