రాష్ట్రవ్యాప్తంగా నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశము మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 తణుకు పట్టణంలో శ్రీ అమృతవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజేపి నాయకురాలు ముళ్ళపూడి రేణుక హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి చిన్నారుల పెంపకంపై చాలా జాగ్రత్త వహించాలని, వారు ఏ విషయంలోనైతే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో అందులో వారిని ప్రోత్సహించాలని, వారిలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడాలని సందేశం ఇచ్చారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి శ్రమిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని సందేశమిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కొద్ది విషయాల గురించి తల్లిదండ్రులతో చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లికి పాదాభివందనం మరియు సత్కారం, ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ముఖ్య అతిధి, చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగినది. తల్లిదండ్రులు వారి చిన్నారుల విద్యా విషయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆలరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది అన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో విన్నాయని విద్యార్థులందరూ వాటిని సద్వినియోగం చేసుకుని మంచి విజయాలను సాధించాలని అన్నారు.
