ఉండ్రాజవరంలో ఘనంగా 30వ గురుపౌర్ణమి వార్షికోత్సవం

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా చివటం రోడ్డు యందు షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక హోమాలు, పూజలు, సాయి వ్రతములు జరిగాయి. 30వ వార్షికోత్సవం సందర్భంగా మందిర కమిటీ సభ్యులు నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు అనంతరం అఖండ అన్నసమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు నిర్విరామంగా యువకులు బాబా మందిరాన్ని నిర్వహిస్తూ ప్రతి యేడాది అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని బాబా మందిర కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు తాళ్లూరి కేదారేశ్వరరావు, కైగాల ప్రసాద్, కైగాల శ్రీనివాస్, కోటిపల్లి శ్రీను, బండారు రాము తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link