మారుతున్న నూతన వ్యవసాయం పద్ధతులలో భాగంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు మరియు నానో టెక్నాలజీ ద్వారా రూపొందినటువంటి నానో యూరియా, డిఏపి ల వినియోగాన్ని పెంచడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని 10 నుంచి 25 శాతం వరకు తగ్గించవచ్చని రైతులకు వ్యవసాయాధికారి బి . రాజారావు సూచన ఇచ్చారు. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఉండ్రాజవరం, దమ్మెన్ను గ్రామాలలో ఉద్యాన శాఖాధికారి డి.సుధీర్ తో కలిపి నిర్వహించి రైతులకు ప్రస్తుతం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా వస్తున్నటువంటి పథకాలను సలహాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు.వరి సాగు చేసే రైతులు ఆగస్టు 15వ తేదీ లోపు పంటల భీమా కింద ప్రీమియంను చెల్లించిన ఎడల గ్రామం యూనిట్ గా, దిగుబడి ఆధారంగా, పంటల భీమా వర్తించే అవకాశం ఉందని దీనికోసం పంట రుణం తీసుకునే బ్యాంకును సంప్రదించాలని రుణం పొందనటువంటి రైతులు విడిగా సంబంధిత రైతు సేవా కేంద్రంలో లేదా మీసేవ కేంద్రాలలో సంప్రదించాలని కోరారు. రసాయనికి ఎరువులకు కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో రాయితీలు ఇవ్వడం వల్ల మరియు ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా అవడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని మరియు రసాయనక ఎరువుల ఉత్పత్తి చేసేటప్పుడు పర్యావరణ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా రైతులు సాంప్రదాయ పద్ధతిలో సేంద్రీయ ఎరువులు మరియు జీవన ఎరువులు అయినటువంటి అజాస్పరిల్లమ్, అజటోబక్టర్, అజోల్ల భాస్వరాన్ని కలిగించి మొక్కకు అందజేసే ఎరువులను వ్యవసాయంలో వినియోగించాలని వీటి ద్వారా రసాయనకు ఎరువుల వినియోగశాతం 10 నుంచి 25% వరకు తగ్గుతుందని తెలిపారు వీటితో పాటుగా నానో టెక్నాలజీ ద్వారా మార్కెట్లో లభ్యం అవుతున్నటువంటి నానో యూరియా డిఏపీలను వాడటం ద్వారా కూడా సాగు ఖర్చు తగ్గడంతో పాటు ఎరువు వినియోగశాతం సాంప్రదాయ రసాయనిక ఎరువులలో 30 నుంచి 40% ఉండగా నానో పద్ధతి ద్వారా వాడినటువంటి ఎరువులలో 70 నుంచి 80% వరకు ఉంటుందని కాబట్టి రైతులు ఈ క్రొత్త విధానాలకు అలవాటు పడాలని కోరారు.ఈ సందర్భంగా పలువురు రైతులు రాయితీపై టార్పాలిన్లు మరియు చేతి స్ప్రేయర్లు సరఫరా చేయాలని ధాన్యం కొనుగోలు సమయంలో పంట ఉత్పత్తికి తగినట్లుగా టార్గెట్లు కేటాయించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని వ్యవసాయ అధికారీని కోరారు. ఉద్యాన శాఖ ద్వారా వచ్చే పథకాలలో ముఖ్యం గా ఆయిల్ పామ్ తోటల పెంపకం, రాయితీ పై డ్రిప్ పథకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సేవా సిబ్బంది లోకేశ్వరి, సురేష్, గ్రేస్, హైమా తదితరులు పాల్గొన్నారు
