వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జెసి రాహుల్ కుమార్ రెడ్డి

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అలంపురం కేంద్రంగా నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు సేవలు అందిస్తున్న వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందినీయమని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. పెంటపాడు మండలం అలంపురంలో వెంకటరమణా చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను వివిధ సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ట్రస్ట్ ఫౌండర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు ప్రత్తిపాడు గ్రామపంచాయతీ కి వాటర్ ట్యాంకర్ ను బహుకరించారు. వాటర్ ట్యాంకర్ ను రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి గురువారం సుమారు పదిమంది స్పెషలిస్టులతో ఉచిత వైద్య సేవలతో పాటు పలు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్న పెద్ద కృష్ణంరాజు అభినందనీయులు అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారని ఈ తరహా వైద్య సేవలను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయోగాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ప్రత్తిపాడు జనసేన అధ్యక్షుడు చెరుకూరి సోమశేఖర్, మజ్జి అప్పారావు, మట్టా రాంబాబు, వీర్ల గోవిందరాజు, గిద్ధా శ్రీనివాస్, పువ్వుల సత్యనారాయణ, తోట శంకర్, తాడిశెట్టి కృష్ణ, నిమ్మకాయల నాగబాబు, తుమ్మగంటి సుధీర్, నిమ్మకాయల మోహన్, చదలవాడ శ్రీకాంత్, తోట శివ, ఆకుల చిరంజీవి, వెజ్జు వెంకటేష్, తోట వంశీ, బూరా సూరి, ఆకుల బాబీ, పడాల సాయి, అగ్రహారపు వెంకన్న, దాయన సాయి, సాయపండు, సత్యమేవజయతే యూత్ సభ్యులు, ONE TEAM – ONE VISION యూత్ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link