ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం

రానున్న ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
తాడేపల్లిగూడెం (అక్టోబర్ 10)
రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఓ మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ను తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు పూర్తి సహాయసహకారాలు అందిస్తానని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరలకే నిత్యవసరాలు వస్తువులు అందించే కౌంటర్ ను ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని అపరిష్వృతంగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ ను, షటిల్ బ్యాట్మెంటన్ కోర్టును, శశి కాలేజ్ సమీపంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా ఏర్పడిందని నిట్లాంటి కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పలు పేరన్న కళాశాలలు పాఠశాలలో ఇక్కడ ఉండడంతో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు అనువైన గ్రౌండ్స్ అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి అనుగుణంగా శశి విద్యాసంస్థలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కేటాయించేందుకు అనుమతులు మంజూరుకు పంపామన్నారు. అతి త్వరలోనే అపరిశుద్ధంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు,అలానే వెంకట్రామ్నగూడెం, నల్లజర్ల మెయిన్ రోడ్ నందు ఇటీవల ప్రభుత్వం గుర్తించిన ఎయిర్పోర్ట్ ఏర్పాటు కు అనువైన స్థలలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీల్, మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు,వర్తనపల్లి కాశీ, పుల్లా బాబి,పాలూరి వెంకటేశ్వరరావు, పై బోయిన వెంకటరామయ్య, గుండమోగల సురేష్,మట్ట రామకృష్ణ,చాపల రమేష్, అడ్డగర్ర సూరి,గట్టింనాని, పిడుగు మోహన్,మారపాక చిట్టి,బయనపాలేపు ముకేష్ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link