చిత్రం కోర్టు తరహాలోనే ఈ సినిమా హిట్ అవుతుంది -హీరో ప్రియదర్శి
సారంగపాణి జాతకం”లో నేను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతాయని హీరో ప్రియదర్శి అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. జగదాంబ వద్ద గల ఒక హోటల్లో జరిగిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ
నేను నటించిన ‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం” అన్నారు. ఇంద్రగంటిగారితో ఒక ఫొటో దిగితే చాలనుకునేవాణ్ణి. అలాంటిది ఆయనే నన్ను పిలిచి, ‘సారంగపాణి జాతకం’ కథ చెప్పారు. ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు. ఈ చిత్రం కోసం ఇంద్రగంటిగారే ఎక్కువగా కష్టపడ్డారు. నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశానంతే. ఇంతవరకు నేనెక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడాను. కానీ, ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను అన్నారు. అనంతరం హీరోయిన్ రూపా కొడువాయూర్ మాట్లాడుతూ కచ్చితంగా అందరిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతి సన్నివేశం ప్రతి ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఇష్టమైన ప్రాంతం అన్నారు. అష్ట చమ్మ చిత్రం విశాఖలో షూటింగ్ చేసి నాని ని హీరోగా వ పరిచయం చేసి విశాఖ ద్వారానే ఆ చిత్ర ప్రమోషన్ చేసాం అని ఇన్నాళ్లు మరల మంచి కథతో అందరూ ఇష్ట పడే హాస్యం తో ఈ చిత్రం ద్వారా ముందుకు వచ్చాము అన్నారు. అదే సెంటిమెంట్ తో విశాఖలో ప్రమోషన్ చేసాం అన్నారు. విశాఖలోని ప్రీమియర్ షో లు కూడా వేస్తున్నాం అన్నారు.