విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్ నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు మరియు సూపర్ స్టార్ కృష్ణ సినీ ఇండస్ట్రీకి పరిచయమై 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సరస్వతి పార్క్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తన అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పరస్పరం తినిపించుకొని అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం పేదలకు వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలను ఈరోజు 70mm, కలరింగ్ స్కోప్, జేమ్స్ బాండ్, కౌబాయ్ వంటి చిత్రాలు తీసుకొచ్చి ఒక ఒరవడి సృష్టించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అని అభిమానులు అందరూ తెలిపారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా తమ అందరి అభిమాన హీరో సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళి అని తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు అన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. అని కొనియాడారు రాజకీయాల్లో కూడా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రను వేసుకున్నారని తెలిపారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తి తీసుకొచ్చిన ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ ని ఆయన జ్ఞాపకాలు గుర్తులు తెలవని రోజు లేదని అన్నారు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే కృష్ణ ఆయన నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అని అన్నారు ఘట్టమనేని శివరామకృష్ణ మొదలుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణగా ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈరోజు అదే బాటలో తండ్రిని మించిన తనయుడిగా మహేష్ బాబు కాని వారి కుమార్తె సితార చేస్తున్న సహాయ కార్యక్రమాలు కుటుంబ వారసత్వంగా తమ సేవ నిరూపిస్తున్నాయి అన్నారు సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్యలైనప్పటికీ సినిమాలతోనూ వ్యక్తిత్వంతోను ఎప్పుడు అభిమానులు గుండెల్లో ఉంటారన్నారు అటువంటి మహనీయులను స్ఫూర్తితో భావితరాలకు తెలియజేసే విధంగా ప్రతి ఏడాది ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మన్యాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డొప్ప రమణ, కాకి సోంబాబు, మన్యాల శ్రీనివాస్, జోరేగల గణేష్, బోధలపాటి ఉమామహేష్, అర్జి శంకర్రావు అక్కరబోయిన శ్రీనివాస్, నీలాపు శ్రీనివాస్ రావు, నమ్మి గణేష్, వెంకట్రావు, రాజు, కేబుల్ శ్రీను మరియు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.