కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భోజనశాల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. కేవలం విద్యతోపాటు క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు సాధించాలని ఆకాంక్షించారు. వేల్పూరు గ్రామ మాజీ సర్పంచ్‌లు పెనుమర్తి వెంకటలక్ష్మి, పెనుమర్తి సోమసూర్యచంద్రరావు (దత్తుడు), కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..