అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు స్వర్ణ పతకాలు

క్రీడాకారులకు అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

క్రీడలను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడి

ఈనెల 27 నుంచి 29 వరకు శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఇన్విడీషనల్‌ రోల్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ 2025 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తణుకునకు చెందిన క్రీడాకారులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. సీనియర్‌ కేటగిరీలో రెడ్డి హర్షవర్థన్, జూనియర్‌ విభాగంలో నలమాటి షరత్రావు, గుల్లపూడి రంజిత్‌కుమార్, సబ్‌ జూనియర్‌ విభాగంలో రెడ్డి గగన్‌దీప్‌లతోపాటు కోచ్‌ లావణ్య, చందులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్య ఇస్తోందని చెప్పారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోందన్నారు. ఏపీను సైతం క్రీడలకు హబ్‌గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. తణుకులో సైతం వివిధ క్రీడలకు సంబంధించి థీమ్‌ ప్రకారం పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన స్కేటింగ్‌ స్టేడియం ద్వారా ఎంతో మంది క్రీడాకారులు తయారవుతున్నారి అంతే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతుండం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించి మరింత మంది క్రీడాకారులను తయారు చేసే విధంగా కోచ్‌ లావణ్య కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

Scroll to Top
Share via
Copy link