గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీలో ఆంక్షలు

కూటమి అధికారంలోకి వచ్చాక ఆంక్షలు తొలగింపు

మొదటి రోజు 98 శాతం పెన్షన్లు పంపిణీ లక్ష్యం

నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

గత ప్రభుత్వ హాయంలో పెన్షన్ల పంపిణీలో సైతం ఆంక్షలు విధించేవారని పలు కారణాలతో ఒక నెల పెన్షన్‌ తీసుకోకపోతే మరుసటి నెల నుంచి పెన్షన్‌ నిలిపివేసేవారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్న అన్నారు. ఎన్టీఆర్‌ భరోసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 22వ వార్డుతోపాటు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మూడు నెలల వరకు పెన్షన్‌ తీసుకోకపోయినా రెండు నెలల బకాయితో కలిపి మూడో నెల అందజేస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 1 ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పంతో తణుకు నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 36 వేల మందికి రూ. 15 కోట్లు మేర ప్రతి నెలా పెన్షన్లు అందిస్తున్నామని మొదటి రోజే దాదాపు 98 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని లక్ష్యంతో కూటమి నాయకులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఇలా ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతేకాకుండా సంక్షేమంలో ఎలాంటి కోతలు, ఆంక్షలకు అవకాశాలు లేకుండా అర్హత కలిగిన ప్రతిఒక్కరికి అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల కొత్త పెన్షన్లు కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి జులై నుంచి పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.

Scroll to Top
Share via
Copy link