బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు

ప్రజలకు సూపర్‌ సిక్స్‌తో సహా 140కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పిలుపునిచ్చారు. కాపు కల్యాణమండపం నందు నిడదవోలు టౌన్ గురువారం “బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ” కార్యక్రమం వైఎస్సార్‌సీపీ నిడదవోలు పట్టణ కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నిడదవోలు పట్టణ స్థాయి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.శ్రీనివాస్‌నాయుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
– ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.లక్షల్లో నగదు వస్తుందని నమ్మించి మోసం చేశారు.
– గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్ని అమలు చేశామని, పార్టీలకు, కుల,మత, రాజకీయాలకు అతీతంగా అర్హులకు లబ్ధిచేకూర్చామని గుర్తు చేశారు.
– సూపర్‌ సిక్స్‌ పథకాలు పూర్తిగా అమలు చేయాలంటే ఏపీని అమ్మాల్సి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు.
–ఒక్క పథకం పూర్తిగా అమలుచేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, చంద్రబాబు అబద్ధాల కోరని ధ్వజమెత్తారు.
– 2024లో ఈవీఎంలతో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనారు కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటారన్నారు.
–నాన్న జీఎస్‌ రావు, తాను ఎప్పుడూ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటామని, కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దని, 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిడదవోలు టౌన్ కమిటీని మరియు సభ్యులను సభకు పరిచయం చేసి అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నిడదవోలు పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ కమిశెట్టి సత్తిబాబు

కౌన్సిలర్లు
బాలరాజు,
ఆలమూరి భారతి,
పిట్ట పద్మావతి ,
బిర్రే పార్వతి,
కదా రునిష బేగం,
ఆకుల ముకుదరావు,
దాకే అనిల్ కుమార్ ,
కో ఆప్షన్ సభ్యులు, ధీరిచన రామచంద్రరావు,
SK వల్లీ,
నియోజకవర్గ ప్రచార కమిటీ ఆలమూరి రాజ, నిడదవోలు పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షులు మడిపల్లి భాస్కర్ రావు,
అంగన్వాడి నియోజకవర్గ విభాగ అధ్యక్షురాలు P. జాన్సీ, వై.యస్.ఆర్.సీపీ కార్యకర్తలు నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ వాలెంటిర్లు,సోషల్ మీడియా సైనికులు, అన్ని విభాగాల కార్యకర్తలు, పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link