మహాప్రభో మా ధాన్యం డబ్బులు జమ చేయండి – కౌలురైతులు గగ్గోలు

ఏప్రిల్ నెలలో రైస్ మిల్లులకు తోలిన ధాన్యానికి నీటికి ధాన్యం డబ్బులు జమ కాలేదని నిరసిస్తూ ఉండ్రాజవరం మండలానికి చెందిన సుమారు 100 మంది రైతులు ఉండ్రాజవరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తాము పండించిన పంటకు టార్గెట్ లేదని, కొద్దిరోజులు గడిపి తర్వాత రైస్ మిల్లర్లు తమ దగ్గర నుండి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని సుమారు నెలరోజులు కావస్తున్న మిల్లర్ల నుండి అధికారుల నుండి ఏ విధమైన సమాధానం లేదని, ఒకపక్క వాతావరణం సహకరించక అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకున్నామని నెల రోజులు కావస్తుందని, ఒక్క రోజులోనే ధాన్యం డబ్బులు జమంటూ చెప్పిన ప్రభుత్వం నెలరోజులు కావస్తున్న తమకు డబ్బులు చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల రైతు సంఘం నాయకులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, పెన్నేటి బాలకృష్ణ, అక్కిన గోపాలకృష్ణ, కడలి శ్రీను, చెట్టే శ్రీనివాసు, కసే రాఘవులు ఈడుపుగంటి ఈడుపుగంటి శ్రీనివాస్ ప్రసాద్, ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం నాయకులు ఒక విజ్ఞాపన పత్రాన్ని మండల తహసిల్దార్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం గ్రామానికి చెందిన రైతులు మరియు కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు బురుగుపల్లి వెంకటేశ్వరరావు, కౌలు రైతులు, మండల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link