కార్మికులకు ఆల్కహాల్ పై అవగాహన

*తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు ఆల్కహాల్ పై అవగాహన* ఆల్కహాల్ అని పేరు ఉన్నవన్నీ మానవుడు సేవించడానికి అర్హమైనవి కావని వాటిలో ఇథై ల్ ఆల్కహాల్ మాత్రమే మానవుడు ప్రత్యక్షంగా సేవించవచ్చు. మిగతా ఆల్క హాల్స్ అన్ని కూడా ప్రమాదకరమని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. శనివారం పైడిపరులోని ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు వివిధ రకాల ఆల్కహాల్సు మరియు వాటి ఉపయోగం , వాటి వల్ల కలిగే ప్రమాదం మరియు వాటి ఎడల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే అంశములపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఆల్కహాల్ అన్నీ కార్బన్, ఆక్సిజన్ ,హైడ్రోజన్ సమ్మేళనంతో కూడుకొని ఉంటాయని , ఆల్క హాల్స్ లో ఇథైల్ ఆల్కహాల్, డినేచర్డ్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్ తదితరాలు కలవని ,ఇవన్నీ చూడటానికి,వాసన పరంగా కూడా ఒకే విధంగా ఉన్నా, మానవుడు సేవించడానికి అర్హమైనవి కాదని, వాటిలో కేవలం ఇదైల్ ఆల్కహాల్ మాత్రమే నేరుగా సేవించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇదే సమయంలో మిగతా ఆల్కహాల్ల్స్ గురించి కూడా తెలుసుకోవలసిన ఆవశ్యకతను వారికి వివరించారు. అసహజ ఆల్కహాల్ లేదా డినేచర్డ్ ఆల్కహాల్ అనేది ఇథైల్ ఆల్కహాల్ కు బెంజిన్, పిరిడిన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలిపి పారిశ్రామిక ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు .శుభ్రపరిచే ఉత్పత్తులు, ఇంధనాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, హ్యాండ్ శానిటైజర్లు, క్రిమిసంహారకాలు తదితరాల్లో ఉపయోగిస్తారు. మిథైల్ ఆల్కహాల్ అనేది ఫార్మా పరిశ్రమలలో, పెయింట్, ప్లాస్టిక్ పరిశ్రమలో సాల్వెంట్ గా ఉపయోగిస్తారు ఇది అత్యంత ప్రమాదకారిణి. ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్ అనేది శానిటైజర్స్, ఆఫ్టర్ షేవ్ లోషన్ , కాస్మొటిక్ ఉత్పత్తుల యందు ఉపయోగిస్తారు. మిథైల్ అసహజ ఆల్కహాల్, ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్ తదితరాలు సేవించడం వల్ల మానవులలో వెంటనే వాంతులు, కడుపునొప్పి, గొంతులో మంట, శ్వాస రేటులో మార్పు, శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం, గుండె కొట్టుకోవటం నెమ్మదించడం,కంటి చూపు కోల్పోవడం , కోమా లోకి వెళ్లి వెంటనే మరణించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆల్కహాల్ మధ్య భేదాన్ని గుర్తించి తగు అప్రమత్తతో ఉండాలని ఈ సందర్భంగా కార్మికులకు మరియు పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు. ఈ యొక్క ఆల్కహాల్స్ ఉపయోగం లో ఎటువంటి మానవ జోక్యమునకు అవకాశం లేకుండా కేవలం యాంత్రిక పరమైన జోక్యంతోటే మరియు కట్టుదిట్టమైన రక్షణ చర్యలతో వీటి యొక్క రవాణా మరియు లోడింగ్, అన్ లోడింగ్ వంటివి చేపట్టాలని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.మధుబాబు హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాస్ మరియు ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link