**బక్రీదు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ* భక్తి, విశ్వాసం, త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని తణుకు పట్టణంలోని పలు మసీదుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మంచిని పెంచే విధంగా భక్తి, విశ్వాసం, నమ్మకంతో మనతోపాటు మన కుటుంబం, సమాజం అభివృద్ధి చెందాలని పండుగ ఇచ్చే సందేశమని అన్నారు. అందుకు అనుగుణంగా సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా అల్లా ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని సూచించారు. రంజాన్, బక్రీదు పండుగల్లో తాను పాల్గొనే విధంగా అల్లా కల్పించిన అదృష్టంగా తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
