అక్రమ బెల్ట్ షాపులు తక్షణం తొలగించాలి

  • అక్రమ బెల్ట్ షాపులు 4 వేలా?
  • గోవా, యానం నుండి వరదలా అక్రమమద్యం.
  • కల్లుగీత చిన్నాభిన్నం.
  • పట్టించుకోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్.
    ఏ పీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి.
    బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తామని ముఖ్యమంత్రి బెల్టు షాపులపై కొరడా ఝాలిపంచమని ఎక్సైజ్ మంత్రి ఇచ్చిన ఆదేశాలు ప్రకారం అక్రమ బెల్ట్ షాపులు తక్షణం తొలగించి, కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహా మూర్తి విజ్ఞప్తి చేశారు. శనివారం తణుకు అమరవీరుల భవనంలో సంఘ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సమావేశం కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నరసింహమూర్తి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు ఉన్న, ఆహారం లాంటి, ప్రకృతి సిద్ధమైన తాటికల్లు పై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం, ఊరు – వాడ పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులో పెట్టించి కల్లు అమ్మకాలు లేకుండా చేయడం దుర్మార్గం అన్నారు. నిత్యం గ్రామాల్లో కలకలలాడే కల్లుగీత కుటుంబాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందనే ఆవేదనతో అన్నారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక సంక్షేమపథకాలు అమలు చేస్తూ, గీత వృత్తిని అన్ని విధాల ఆదుకుంటున్నాయని. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం గీత వృత్తి పై కక్షగట్టి పొమ్మనకుండా పొగ పెడుతోందని విమర్శించారు.
    మద్యం సిండికేట్లు, ప్రభుత్వ పెద్దలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలసి మీకు ఇంత, మాకింత అనే పద్ధతి అమలు చేస్తున్నందువల్లనే ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రుల ఆదేశాలు ఖాతరు చేయటం లేదని విమర్శించారు. నరసాపురం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులు లక్షల్లో వేలం పాటలు వేస్తున్నారని అక్కడ ఎక్సైజ్ వారు ఉన్నా, లేకున్నా ఒక్కటే నన్నట్లుగా సాగుతోందన్నారు. అమృత వైన్స్ సిండికేట్ వారు మా సంఘ నాయకుడి పైనే దాడి చేసి సాల్తి లేపేస్తామని హెచ్చరించారంటే పరోక్షంగా ప్రభుత్వాండా చూసుకునే మాట్లాడుతున్నారన్నారు.
    సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీత కార్మికులు జీవితాలు మారతాయని ఆశించారు కానీ గత ప్రభుత్వమే మంచిదన్నట్లు నేడు ఉందన్నారు. గీత కార్మికుల ఉపాధి, సంక్షేమం, వృత్తి ఆధునీకరణల గురించి ఆలోచించే ప్రభుత్వాలు లేనప్పుడు – రానప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న గీత కుటుంబాలకు వరిగేదేమి లేదని ఆవేదనతో అన్నారు. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయని అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, మహిళలు సైతం మద్యానికి బానిసలు అయ్యేలా ప్రభుత్వం చేయడం మంచిది కాదన్నారు. ఏనాడు లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో గీత కార్మిక కుటుంబాలు కల్లు అమ్మకాలు లేక ఆర్థిక సంక్షోభంలో కురుకు పోయాయని అన్నారు. మన వృత్తిని మనమే కాపాడుకోవాలి. రండి. జూలై 14వ తేదీన మన బాధలు కలెక్టర్ గారికి చెప్పుకుందాం భీమవరం తరలిరండి అని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్క చంటి, జిల్లా ఉపాధ్యక్షులు కడలి పాండు, జిల్లా ఉపాధ్యాయ మామిడిశెట్టి నాగభూషణం, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి సూరి బాబు, జిల్లా సీనియర్ నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, కాసాని శ్రీను, కట్టా వెంకటేశ్వర రావు, పిల్లి ఏడుకొండలు పాల్గొన్నారు.
Scroll to Top
Share via
Copy link