తణుకు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎన్.సి.సి విద్యార్థులకు “2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనా మిషన్” మరియు” డెంగ్యూ అవగాహన కార్యక్రమాన్ని హెడ్ మాస్టర్ కె.పద్మావతి వారి ఆధ్వర్యంలో ఎన్.సి.సి.ఆఫీసర్ సి.హెచ్.రాజు ఆర్గనైజ్ చేయగ,సికిల్ ఎనీమియా పై బ్యాంక్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.డానియల్ రాజు అవగాహన కల్పిస్తూ”ఈ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్తకణాల రుగ్మత అని,తల్లి తండ్రి నుండి అనువంశికంగా వస్తుందని,దీనివలన రక్త హీనత,అలసట,నొప్పులు,శ్వాసలో ఇబ్బందులు,తరచూ అంటు వ్యాధులు రావడం,గర్భాధారణ సమయంలో సమస్యలు అవయవ వైఫల్యం,పెరుగుదల సమస్యలు వస్తాయని,రక్త హీనత ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ గారిని సంప్రదించాలని,ఐరన్ పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని” ఉద్బోధించారు.అనంతరం సీజనల్ డిసీజెస్ మలేరియా, డెంగ్యూ,చికున్ గున్యా, అతిసారం,టైఫాయిడ్,కామెర్లు సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. హెడ్ మాస్టర్ కె.పద్మావతి మాట్లాడుతూ “విన్నది ఆచరించాలని,అందరూ ఆచరించాలా ఎడ్యుకేట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ హెల్త్ సెక్రెటరీ బి.వెంకటరమణ,కె.అనూషా సువర్ణ,ఆశా కార్యకర్త లలిత పాల్గొన్నారు
