జాతీయ డెంగ్యూ మాసోత్సవం జూలై -2025 , సందర్భంగా ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు డెంగ్యూ వ్యాధి పైన అవగాహన మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నందు డాక్టర్ బి.దుర్గా మహేశ్వర రావు , డాక్టర్ ఆర్.ఉషా దేవి గారు, మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ల పైన, మరియు దోమల వల్ల వచ్చే మలేరియా , డెంగ్యూ , చెకెన్ గున్యా , వంటి వ్యాధుల పైన అప్రమత్తముగా ఉండాలని తెలియజేశారు, దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని సూచించారు, జ్వరం తో బాధపడే వారు, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రము నకు వచ్చి తగిన రక్త పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు సకాలం లో వాడాలని తెలియజేశారు, వర్షాకాలం లో దోమలు వృద్ది చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాలు నిల్వ ఉన్న నీటిని లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ప్రతి శుక్రవారం ఫ్రై డే- డ్రై డే నిర్వహించాలని తెలియజేశారు.ఇంటి ప్రాంగణం లో టైర్లు , కాలీ కొబ్బరిబొండాలు , నీటి తోట్టెలలో దోమ లార్వాలు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పబ్లిక్ హెల్త్ నర్స్ కేడివిఎల్, కుమారి, ఆరోగ్య పర్యవేక్షకులు ఏ. శ్రీరామ మూర్తి, రత్నకుమారి, ఎం.ఎల్.హెచ్.పి లు, మహిళా ఆరోగ్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్ లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
